ఎన్నికల బాండ్ల ‘నంబర్ల’ చిట్టా విడుదల చేసిన ఈసీ

by Hajipasha |
ఎన్నికల బాండ్ల ‘నంబర్ల’ చిట్టా విడుదల చేసిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు సహా అన్ని వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సమర్పించింది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్‌బీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇక వెంటనే ఆ సమాచారంతో కూడిన పీడీఎఫ్ ఫైళ్లను కేంద్ర ఎన్నికల సంఘం తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ పీడీఎఫ్ ఫైళ్లలో వివిధ కార్పొరేట్ కంపెనీల ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను కూడా ప్రస్తావించారు. ఈ నంబర్ల ఆధారంగా ఆయా కంపెనీల నుంచి విరాళాలు ఏయే రాజకీయ పార్టీలకు చేరాయనేది తెలిసిపోతుంది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో దీన్ని కీలక పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

Advertisement

Next Story