- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఆరోపణలకు ఈసీ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగడం లేదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అభ్యర్థుల సమక్షంలోనే కొనసాగుతోందని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సవ్యంగా సాగుతోందంటూ కాంగ్రెస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. తమకు ఇప్పటివరకు ఏ కౌంటింగ్ కేంద్రం నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఈసీ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల్లానే హర్యానాలోనూ ఓట్ కౌంటింగ్ ట్రెండ్స్‌ని ఈసీఐ సరిగా అప్‌డేట్ చేయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ కొద్ది సేపటి క్రితమే ఈసీపై ఆరోపణలు చేశారు. 12, 13 రౌండ్ల లెక్కింపు పూర్తయినా ఈసీ వెబ్‌సైట్లో 4, 5 రౌండ్ల ఫలితాలు మాత్రమే చూపిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ ముందంజలో ఉన్న నియోజకవర్గాల వివరాలు వేగంగా వెల్లడించడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు.