Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నీవీస్ పేరు ఖరారు..!

by Shamantha N |   ( Updated:2024-12-03 10:44:28.0  )
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నీవీస్ పేరు ఖరారు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పేరు ఖరారైనట్లు సమాచారం. డిసెంబరు 5న మహారాష్ట్ర (Maharashtra) కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. షిండే తో పాటు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) కూడా డిసెంబర్ 5న ప్రమాణస్వీకార చేయనున్నారు. బీజేపీకి 21-22 మంత్రిత్వశాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. శివసేన 16 మంత్రిత్వశాఖలు కోరగా.. 12 ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అలానే ఎన్సీపీకి 9-10 మంత్రిత్వశాఖలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ శాసనసభాపక్ష నేతల మీటింగ్

బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీలను పరిశీలకులుగా కాషాయపార్టీ అధిష్ఠానం నియమించింది. సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి (Mahayuti) కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని, హోంశాఖను కేటాయించాలని షిండే పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎన్డీఏ నేత రాందాస్ అథవాలే షిండేతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక, గత కొంతకాలం జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో థానేలోని ఆస్పత్రిలో చేరారు. టెస్టుల తర్వాత ఆయన విడుదలయ్యారు. ప్రస్తుతం, ఆరోగ్యం బాగానే ఉందని మీడియాతో చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed