గతేడాదితో పోలిస్తే సాగుకు పెరిగిన బడ్జెట్

by Shamantha N |
గతేడాదితో పోలిస్తే సాగుకు పెరిగిన బడ్జెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.1,27,469.88 కోట్ల కేటాయింపులు మాత్రమే జరపగా, ఇందులో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1,17,528.29 కోట్లు, అగ్రికల్చర్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు రూ.9,941.09 కోట్లు కేటాయించారు.

2023లో బడ్జెట్‌లో కేంద్రం ఈ శాఖకు రూ.1,25,035 కోట్లు కేటాయించింది. అంటే, గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి వ్యవసాయ మంత్రిత్వశాఖకు రూ.2,400 కోట్లకు పైగా నిధులు ఎక్కువగా కేటాయించింది. మొత్తం కేటాయింపుల్లో రెవెన్యూ వ్యయం కింద రూ.1,27,367.74 కోట్లు ఖర్చు చేయనుండగా, మూలధన వ్యయం కింద రూ.102.14 కోట్లు మాత్రమే వెచ్చించనుంది.

దేశంలో పాల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేయనున్నారు. పాడిరైతుల ప్రోత్సహానికి ప్రత్యేకసమగ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల్ మిషన్ ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు. రైతుల కోసం నానో యూరియా తర్వాత నానో డీపీఏ కింద ఎరువులు అందజేయనున్నారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భర్ కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. సాగు ఉత్పత్తులు, ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం చేయనున్నారు. ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed