టార్గెట్ శరద్ పవార్.. ఎన్సీపీ చీఫ్ సోదరుడి మనవడిపై ఈడీ రైడ్స్

by Hajipasha |
టార్గెట్ శరద్ పవార్.. ఎన్సీపీ చీఫ్ సోదరుడి మనవడిపై ఈడీ రైడ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈడీ దాడులు ముమ్మరం అయ్యాయి. ఓ వైపు బెంగాల్‌లో.. మరోవైపు మహారాష్ట్రలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడుగా సోదాలు చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సోదరుడి మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు చెందిన బారామతి ఆగ్రో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేశారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా బారామతి, పుణె, ఔరంగాబాద్‌, అమరావతితో సహా ఆరుచోట్ల ఈ రైడ్స్ జరిగాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ పదేపదే సమన్లు పంపుతుండటంపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కీలక ఆప్‌ నేతలను జైల్లో వేసిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు కేజ్రీవాల్‌ అరెస్టు‌కు యత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ అచ్చం హిట్లర్‌లా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. విపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed