Ponniyin Selvan : 'పొన్నియిన్ సెల్వన్' నిర్మాతలపై ఈడీ దాడులు

by Mahesh |   ( Updated:2023-05-16 06:48:44.0  )
Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వన్ నిర్మాతలపై ఈడీ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. దీంతో 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం దాడులు జరిపినట్లు తెలుస్తుంది. చెన్నైలోని వారి కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా 'ఇండియన్ 2, రోబో '2.0'లను కూడా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీంతో ఈడీ అధికారులు చెన్నై వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story