ED Raids: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపై ఈడీ దాడులు

by Mahesh Kanagandla |
ED Raids: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపై ఈడీ దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్‌ల(Flipkart)పై ఈడీ గురువారం రైడ్స్(ED Raids) చేయడం కలకలం రేపింది. ఫెమా(ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) ఉల్లంఘనలపై 19 చోట్ల ఈడీ దాడులు జరిపింది. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మెయిన్ వెండర్లు లక్ష్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్ సహా హార్యానాలోని పంచకులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలపై అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ రెండు సంస్థలు ఎఫ్‌డీఐ(ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వస్తువులు, సేవల విక్రయ ధరలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నాయని విక్రేతలకు వాటిని అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. ఉల్లంఘనల పరిధిని నిర్ణయించడంపై తమ ఎంక్వైరీ ఫోకస్ పెట్టిందని సెంట్రల్ ఏజెన్సీ తెలిపింది. ఈ రెండు ఈ కామర్స్ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ ఫెమా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈ కామర్స్ సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువులు లేదా సేవల అమ్మకాల ధరలను ప్రభావితం చేయడం ద్వారా ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఏజెన్సీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed