- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ వ్యవహారంపై ప్రధాని మౌనానికి కారణాలేంటి: Rahul Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ నుంచి అనేక మంది డ్రగ్స్ రవాణా చేశారని, ఈ విషయంలో ఎంతకాలం మౌనంగా ఉంటారని ప్రధానిని ప్రశ్నించారు. గాంధీ-పటేల్ ల పవిత్ర భూమిలో విషాన్ని వ్యాప్తి చేస్తున్నది ఎవరో వెల్లడించాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ డ్రగ్స్ వ్యాపారమా అంటూ తన ప్రశ్నలకు సమాధానం తెలపాలని కోరారు.
పదే పదే డ్రగ్స్ లభిస్తున్నప్పటకీ ఇంతవరకు పోర్టు యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 'ఎన్సీబీ, నార్కోస్ డ్రగ్స్ దందాను నడుపుతున్న వారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి?. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వంలో ఉండి డ్రగ్స్ మాఫియాకు సహకరిస్తున్న స్నేహితులు ఎవరు?' అంటూ ట్వీట్‌లో ప్రశ్నలు వేశారు. ప్రధాని మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు.