- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే దేశ భద్రతకు శత్రువు: అమిత్ షా
బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్(మాదకద్రవ్యాలు) దేశ భద్రతకు, భవిష్యత్తుకు శత్రువని అన్నారు. మోడీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం వాటిని నిర్మూలించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సులో మాట్లాడిన ఆయన,, డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మార్చే విధానాన్ని ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. డ్రగ్స్ రవాణా అంశం కేంద్రం, రాష్ట్రానికో సంబంధించినది కాదని అన్నారు. ఇది జాతీయ సమస్య అని అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రజలు కూడా భాగం కావాలని కోరారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. 2014కు ముందుతో పోలిస్తే డ్రగ్స్ రవాణాకు సంబంధించిన కేసులు 25 రెట్లు పెరగ్గా, రూ.20వేల కోట్లకు పైగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు.