డ్రగ్స్ అక్రమ రవాణా: ఇరాన్ పడవను ఛేజ్ చేసి మరి..

by Sathputhe Rajesh |
డ్రగ్స్ అక్రమ రవాణా: ఇరాన్ పడవను ఛేజ్ చేసి మరి..
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ సరఫరా కుట్ర భగ్నమైంది. గుజరాత్ తీరంలో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్ తరలిస్తున్న పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పడవలో ఐదుగురు ఇరానీ దేశస్తులను అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు అలర్ట్ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సోమవారం రాత్రి రెండు పడవలతో అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహించారు.

ఆ సమయంలో గుజరాత్ లోని కచ్ జిల్లా జాఖౌ తీరాలనికి 340 కిలో మీటర్ల దూరంలో ఓ పడవ అనుమానాస్పదంగా కనిపించింది. పట్టుకునేందుకు వెళ్లి పోలీసులను చూసి పడవతో పారిపోయేందుకు నిందితులు యత్నించగా కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. పడవ ఇరాన్ కు చెందినదిగా గుర్తించిన అధికారులు పడవలోని ఇరాన్ దేశస్తులను అరెస్ట్ చేశారు. ఈ విదేశీ మాదక ద్రవ్య ముఠా గురించి లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed