కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. విపక్షాల మండిపాటు

by Disha Web Desk 17 |
కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. విపక్షాల మండిపాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ మరో కొత్త వివాదం తెరలేచింది. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ అయినటువంటి దూర్‌దర్శన్ తన లోగోను ఎరుపు నుండి కాషాయ రంగులోకి మార్చింది. ఇది ఏప్రిల్ 16 నుంచి కనిపిస్తుంది. ఆ రోజు అధికారిక ఎక్స్‌లో, లోగో మారినప్పటికి, విలువలు అలాగే ఉంటాయి, వాటి విషయంలో ఎలాంటి తేడాలు లేవు, మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి, వేగంపై కచ్చితత్వం, క్లెయిమ్‌లపై వాస్తవాలు, సంచలనాత్మకత సంఘటనలపై నిజం మాట్లాడడానికి మాకు ధైర్యం ఉంది. ఎందుకంటే డీడీ న్యూస్‌ అంటేనే నిజం అని వ్యాఖ్యానించింది.

అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దూర్‌దర్శన్ తన లోగోను అధికారిక బీజేపీకి చెందిన కాషాయ రంగులోకి మార్చడం కాస్త ఇప్పుడు రాజకీయంగా కొత్త వివాదానికి తెరలేచింది. విపక్షాలు దీనిపై మండిపడుతున్నాయి. ఆఖరికి దూరదర్శన్‌ను కాషాయికరణ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

1982లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంలో దూరదర్శన్ రంగు వెర్షన్ ప్రారంభమైంది.ప్రస్తుతం, దూరదర్శన్ 6 జాతీయ చానెల్‌లు, 17 ప్రాంతీయ చానెల్‌లను నిర్వహిస్తోంది. జాతీయ చానెల్‌లలో DD నేషనల్, DD ఇండియా, DD కిసాన్, DD స్పోర్ట్స్, DD ఉర్దూ, DD భారతి ఉన్నాయి.

మరోవైపు, DD అరుణ్‌ప్రభ, DD బంగ్లా, DD బీహార్, DD చందన, DD గిర్నార్, DD మధ్యప్రదేశ్, DD మలయాళం, DD నార్త్ ఈస్ట్, DD ఒడియా, DD పొధిగై, DD పంజాబీ, DD రాజస్థాన్, DD సహ్యగిరి, DD సప్తగిరి, DD ఉత్తర ప్రదేశ్, DD యాదగిరి, DD కాశీర్ వంటి ప్రాంతీయ చానెల్‌లు ఉన్నాయి.

Next Story