- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాణించిన హెడ్, నితీష్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోర్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ నడుస్తుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. మొదట్లో ఓపెనర్ శర్మ అవుట్ కావడంతో కాస్త స్లోగా ఆడారు. అనంతరం రెండో వికెట్ కోల్పోగా.. నితీశ్ కుమార్ రెడ్డి, హెడ్ కలిసి హైదరాబాద్ జట్టుకు భారీ పాట్నర్షిప్ అందిచారు. ఓపెనర్ హెడ్ 58 పరుగులు చేసి అవుట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన క్లాసెన్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించారు. మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి 41 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అలాగే క్లాసెన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 1 వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో రాజస్థాన్ జట్టు గెలవాలంటే 120 బంతుల్లో 202 పరుగులు చేయాల్సి ఉంది.