కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత.. ఏమైందంటే..?

by Hajipasha |
కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత.. ఏమైందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో టెంట్లు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపైకి బుధవారం ఉదయం ఇజ్రాయెలీ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. ఈనేపథ్యంలో గురువారం ఉదయాన్నే వందలాదిగా పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించి.. నిరసనకారుల టెంట్లను తొలగించారు. ఈక్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. టెంట్ల తొలగింపుపై నిరసనకు దిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఈ పరిణామంతో దాదాపు 2వేల మంది నిరసనకారులు కాలిఫోర్నియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆందోళనను అకస్మాత్తుగా విరమించాల్సి వస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో వర్సిటీలో తరగతుల నిర్వహణ, ఇతర కార్యకలాపాలు స్తంభించాయి.

Next Story