సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మారొద్దు

by samatah |   ( Updated:2022-08-27 12:17:26.0  )
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మారొద్దు
X

న్యూఢిల్లీ: బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యా కేసు తరహాలో సోనాలి కేసు మారొద్దని వారు పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ కుటుంబం ఇప్పటికీ అది హత్యగానే భావిస్తోందన్నారు. నటి రియా చక్రవర్తి సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు వారు అనుమానిస్తున్నారని సోనాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రియా చక్రవర్తి ప్రస్తుతం బయటే ఉందని, ఇంకా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. అయితే సోనాలి ఫోగట్ కేసు డ్రగ్స్‌పై కాదని, ఆమె హత్యపై కేసు విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరారు. హంతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సోనాలి హత్యకు గురైందని నిరూపణ కాకపోతే కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. అవసరమైతే నార్కో టెస్ట్ కూడా నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా, సోనాలి ఫోగట్ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు శుక్రవారం క్లబ్ ఓనర్, డ్రగ్ సప్లయర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ఆయన కమిట్‌మెంట్‌కు ఫిదా అయ్యా : Rakul Preet Singh

Advertisement

Next Story

Most Viewed