క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు కీలక మార్గదర్శకాలు

by Hajipasha |
క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు కీలక మార్గదర్శకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో విద్యా, వైద్య రంగాలకు క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేకించి క్రైస్తవ మిషనరీలు నిర్వహించే విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతో మంది అత్యున్నత స్థానాలకు ఎదిగారు. తాజాగా క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) క్రైస్తవ మిషనరీలు నిర్వహించే విద్యాసంస్థలకు పలు కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతిరోజూ దేశ రాజ్యాంగ ప్రవేశికను విద్యార్థులతో చదివించాలని నిర్దేశించింది. క్రైస్తవ సంప్రదాయాలను ఆచరించాలంటూ ఇతర మతాలకు చెందిన విద్యార్థులను బలవంతం చేయకూడదని కోరింది. అన్ని మతాలు, సంప్రదాయాలను ఆచరించేలా విద్యార్థులకు బోధనలు చేయాలని మిషనరీ స్కూళ్లకు సీబీసీఐ సూచించింది. ఇతర మతాల విద్యార్థులు సైతం ప్రార్థనలు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక గదులను మిషనరీ స్కూళ్ల క్యాంపస్‌ల పరిధిలో అందుబాటులోకి తేవాలని పేర్కొంది. ఈమేరకు 13 పేజీల డాక్యుమెంట్‌‌ను క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు సీబీసీఐ పంపింది.

Advertisement

Next Story

Most Viewed