Highest Honour: ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం

by Rani Yarlagadda |
Highest Honour: ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్రమోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. కరీబియన్ కంట్రీ అయిన కామన్వెల్త్ ఆఫ్ డొమినికా (Dominica) తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును (Highest Honour) మోడీకి ప్రకటిస్తూ.. గురువారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ సమయంలో మోడీ (Modi) డొమినికాకు భారత్ అందించిన సాయాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాన్ని ఇది మరింత బలోపేతం చేసిందని డొమినికా కొనియాడింది. 2021 ఫిబ్రవరిలో మోడీ.. డొమినికాకు 70 వేల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించారు. దాని వల్ల తాము పొరుగు దేశాలకు అండగా నిలగలిగామని, అందుకే తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధానికి అందించి సత్కరించాలని నిర్ణయించుకున్నామని డొమినికా ప్రధాని కార్యాలయం తెలిపింది. నెక్ట్స్ వీక్ గయానాలో జరిగే ఇండియా - కరికోమ్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 19 నుంచి 21 మధ్య ఈ సదస్సు జరుగనుంది.

Advertisement

Next Story

Most Viewed