- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే సమస్య నుంచి బయటపడొచ్చు..
దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో నిరాశ, నిస్పృహలకు లోను కావచ్చు. కొందరిలో ఇటువంటి పరిస్థితి ఆత్మహత్య ఆలోచనలను కూడా ప్రేరేపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్ స్లో పాయిజన్ లాగా వ్యక్తిని తినేస్తుంది. అందుకే దానిని పారదోలేందుకు ప్రయత్నించాలని, అలాంటి ఆలోచనలను డైవర్ట్ చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
*డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు త్వరగా లేవడానికి, బయటి ప్రపంచాన్ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి వ్యక్తులు తమ లైఫ్ స్టయిల్‌ను మార్చుకోవడం ద్వారా సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ప్రకృతిని, బయటి ప్రపంచాన్ని ఆస్వాదించడం ద్వారా మేలు జరుగుతుంది.
*ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడినప్పుడు మనసు తేలికపడుతుంది. ఆత్మీయుల సంభాషణ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ఇష్టమైన పుస్తకాలు, నవలలు చదవడం, ఫన్నీ వీడియోలు, కామెడీ సినిమాలు చూడటం మేలు చేస్తాయి.
*ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వేధిస్తుంటే అద్దం ముందుకు వెళ్లండి. మీ మొహం చూసుకుంటూనో, తల దువ్వుకుంటూనో ఉండండి. మీకు మీరు రకరకాల పొజిషన్లలో అందమైన వ్యక్తులుగా ఊహించుకోండి. లేదా అందంగా రెడీ అవ్వండి. ఇటువంటి చర్యలు కూడా డిప్రెషన్‌ను దూరం చేస్తాయి.
*మానసిక సమస్యలను దూరం చేయడంలో యోగా, వ్యాయామం బాగా తోడ్పడతాయి. వీటిపై దృష్టి పెట్టడం కారణంగా మీ మనస్సు బాధల నుంచి బయటపడుతుంది.
*డిప్రెషన్‌కు శరీరంలో కొన్ని పోషకాల లోపం కూడా కారణం కావచ్చు. కాబట్టి పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, మాంసం, పాలు, గుడ్లు వంటివి రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకోవాలి. జీవనశైలి మార్పులతో, ఆలోచనలను డైవర్ట్ చేసే చర్యలతో కూడా మీ మనసు కుదుటపడకపోతే సైకియాట్రిస్టులను సంప్రదించడం మేలు.