పాత పార్లమెంట్ బిల్డింగ్ను ఎవరు ప్రారంభించారో తెలుసా?

by Javid Pasha |
పాత పార్లమెంట్ బిల్డింగ్ను ఎవరు ప్రారంభించారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. మే 28న ప్రధాని మోడీ ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఇక నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని కాదని ప్రధానమంత్రి కొత్త పార్లమెంట్ ను ఎలా ప్రారంభిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పాత పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించారు అనే సందేహం ప్రజల్లో నెలకొంది. పాత పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించారా లేక ప్రధాన మంత్రినా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంతకు పాత పార్లమెంట్ భవనాన్ని ఎప్పుడు నిర్మించారు? ఎవరు ప్రారంభించారు? అనే విషయాలు తెలుసుకుందాం.

వృత్తాకారంలో ఉండే పాత పార్లమెంట్ భవన డిజైన్ ను 1913లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. ఇక 1921లో మొదలైన భవన నిర్మాణం 1927లో పూర్తైంది. ఇక ఈ భవనాన్ని 1927 జనవరి 18న భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. మొదట ఇది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా ఉండేది. భారతదేశంలో బ్రిటీష్ పాలన ముగిసిన తరువాత, దీనిని భారత రాజ్యాంగ సభ స్వాధీనం చేసుకుంది. తర్వాత 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దీనిని భారత పార్లమెంటు స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి 2023 మే 27 వరకు దాదాపు 96 ఏళ్ల పాటు ఈ భవనం పార్లమెంట్ గా సేవలు అందించింది.

Advertisement

Next Story

Most Viewed