- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sukesh : నన్నే ఆర్థిక నేరగాడు అంటారా ? సిసోడియాకు సుకేశ్ లీగల్ నోటీసులు
దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక నేరగాడు, మోసగాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు తనకు బేషరతు క్షమాపణలు చెప్పాలంటూ ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు సుకేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులు ఆదివారం సిసోడియాకు అందాయి. కించపరిచేలా సిసోడియా చేసిన వ్యాఖ్యల వల్ల తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని సుకేశ్ పేర్కొన్నారు. మానసిక వేదనను కూడా అనుభవించానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల్లో మంచి విలువ ఉందని.. అలాంటి పార్టీలో ఉన్న నాయకుడిగా మనీశ్ సిసోడియా రెట్టింపు బాధ్యతతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు.
‘‘నా పరువు తీసినందుకు, ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు భారత న్యాయ సంహిత ప్రకారం రెండేళ్ల దాకా జైలుశిక్ష పడుతుంది’’ అని లీగల్ నోటీసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తావించారు. ఈ నోటీసు అందుకున్న వారంలోగా తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ బేషరతుగా మనీశ్ సిసోడియా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నోటీసులకు స్పందించకుంటే సిసోడియాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని సుకేశ్ స్పష్టం చేశారు. కాగా, వివిధ ఆర్థిక నేరాల కేసులలో విచారణను ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైలులో ఉన్నారు. తన న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసును సిసోడియాకు పంపారు.