అన్ని మతాల్లో విడాకులు.. ట్రిపుల్ తలాక్‌ మాత్రమే నేరమా : పినరయి విజయన్

by Sathputhe Rajesh |
అన్ని మతాల్లో విడాకులు.. ట్రిపుల్ తలాక్‌ మాత్రమే నేరమా : పినరయి విజయన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్ బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అన్ని మతాల్లో విడాకులు తీసుకుంటున్నప్పుడు కేవలం ట్రిపుల్ తలాక్ ను మాత్రమే నేరంగా చూపడం సరికాదన్నారు. చట్టాలు చేసి ట్రిపుల్ తలాక్ ను క్రిమినలైజ్ చేసి చూపడం ఏంటని ప్రశ్నించారు. కోర్టులో అన్ని విడాకుల కేసులు సివిల్ మ్యాటర్ కిందకు వచ్చినప్పడు కేవలం ముస్లింలకు మాత్రమే ఇది నేరం కిందకు వస్తుందా అని ప్రశ్నించారు.

ముస్లిం దంపతులు విడాకులు తీసుకున్న సందర్భంలో భర్త ట్రిపుల్ తలాక్ చెబితే జైలుకు పంపుతున్నారు కదా అన్నారు. కేరళలో జరిగిన సీపీఎం మార్చ్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీ హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సిల కోసం తీసుకురానున్న సీఏఏ(సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) ను ఎట్టి పరిస్థితుల్లో కేరళలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేంద్రం మతాన్ని సిటిజన్ షిప్ ఇవ్వడానికి ప్రతిపాదికగా చూస్తోందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే తమ స్టాండ్ ను కేంద్రానికి తెలిపామన్నారు.

Advertisement

Next Story

Most Viewed