- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Olympics: వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె ఓవర్ వెయిట్ కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా 140 కోట్ల భారతీయులు గోల్డ్ మెడల్ ఆశలను ఆవిరి చేసింది. కాగా వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడటంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్! మీరు భారత దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయునికి స్ఫూర్తి అని రాసుకొచ్చారు. ఈరోజు మీకు తగిలిన ఎదురుదెబ్బ మమ్మల్ని బాధిస్తుంది. ఈ సవాళ్లను ఎదురొడ్డడం మీ స్వభావం. మీరు బలంగా తిరిగి రండి! భారత ప్రజలం నీ వెంటే ఉంటామని ప్రధాని మోడీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే అనర్హత వేటుపై పీటీ ఉష తో మాట్లాడని మోడీ.. వెంటనే నిరసన వ్యక్తం చేయాలని భారత ఒలింపిక్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పై పార్లమెంట్ లో చర్చించాలని విపక్షలు పట్టుబట్టాయి ఈ క్రమంలో క్రీడా శాఖ మంత్రి దీనిపై ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు.