Rahul Gandhi: ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులకు ఇలాంటి దుస్థితా?.. ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

by Shamantha N |
Rahul Gandhi: ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులకు ఇలాంటి దుస్థితా?.. ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎయిమ్స్(AIIMS) లోని రోగుల దుస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. ఎయిమ్స్ లోని రోగుల బంధువులను రాహుల్ గాంధీ కలిశారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. "వ్యాధుల భారం, తీవ్రమైన చలి, ప్రభుత్వ నిర్లక్ష్యం - ఈ రోజు నేను ఎయిమ్స్ వెలుపల ఉన్న రోగులను, వారి కుటుంబాలను కలిశాను. వారు చికిత్స కోసం దూర ప్రాంతాల నుండి వచ్చారు. చికిత్స పొందేందుకు నెలల తరబడి వేచిచూస్తున్నారు. ట్రీట్మెండ్ కోసం సరైన వసతి లేక, రోడ్లపై, ఫుట్‌పాత్‌లు, సబ్ వేలపై నిద్రించాల్సి వస్తుంది. చలి, ఆకలి, అసౌకర్యాలతో పోరాడుతూనే ఉన్నారు" అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రజల పట్ల తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇలాంటి దుస్థితిలో జీవించాల్సి వస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

బాలికకు సాయం చేస్తానని హామీ

ఎయిమ్స్‌లో బ్లడ్ క్యాన్సర్ పేషంట్ అయిన 13 ఏళ్ల బాలికకు సాయం చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తన కుమార్తె కోసం ట్రీట్మెండ్ ఇప్పించేందుకు డిసెంబర్ 3న ఎయిమ్స్ చేరుకున్నట్లు పవన్ కుమార్ అనే వ్యక్తి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికీ సరైన ట్రీట్మెండ్ అందలేదని పేర్కొన్నారు. కాగా.. రాహుల్ గాంధీ తమతో మాట్లాడినట్లు.. తన నంబర్ తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తనను సంప్రదించి వీలైన సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నగదు సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Next Story

Most Viewed