నీలేశ్ కుంభానీ అదృశ్యం!..సూరత్‌లో బీజేపీ ఏకగ్రీవం తర్వాత కీలక పరిణామం

by samatah |
నీలేశ్ కుంభానీ అదృశ్యం!..సూరత్‌లో బీజేపీ ఏకగ్రీవం తర్వాత కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని సూరత్ లోక్ సభ నియోజకర్గంలో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నీలేశ్ కుంభానీ నామినేషన్ తిరస్కరించడంతో బీజేపీ నేత ముశేశ్ దళాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ తిరస్కరణ తర్వాత నీలేశ్ కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. పోన్‌లో కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయినట్టు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫిర్యాదు చేసింది. సూరత్‌లో ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభించాలని తెలిపింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి సూరత్ తొలి విజయం బహూకరించిట్టు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు.

బీజేపీలోకి నీలేశ్?

అయితే కనిపించకుండా పోయిన నీలేశ్ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు కథనాలు వెలుబడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు భారీగా నిరసన తెలిపారు. నీలేశ్ ప్రజా ద్రోహి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. లోక్‌సభ స్థానం నుంచి ఏకపక్ష విజయం కోసం బీజేపీతో చేతులు కలిపారని మండిపడ్డారు. మరోవైపు సూరత్‌లోని ఓ హోటల్ కేంద్రంగా బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed