- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యం: విచారణ చేపట్టిన పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ చికిత్స కోసం ఈ నెల12న కోల్‌కతాకు వచ్చారు. అనంతరం బారానగర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో బసచేశారు. ఈ క్రమంలోనే మే 14వ తేదీ నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అజీమ్ ఫోన్ సైతం స్విచ్చాఫ్ లో ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ విషయాన్ని అజీమ్ కుటుంబం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఢిల్లీ, కోల్ కతాలోని తమ దౌత్యవేత్తలకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఎంపీ అజీమ్ ఆచూకీ లభించలేదు. కాగా, అజీమ్ వైద్య చికిత్స కోసం తరచుగా భారత్‌కు వస్తారని, కోల్‌కతాలో అతని స్నేహితులు కొందరు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మే 12న అజీమ్ దర్శన సరిహద్దు గుండా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించారని తెలుస్తోంది.