- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వెస్ట్ బెంగాల్’ వద్దు.. ‘బంగ్లా’ ముద్దు.. రాష్ట్రానికి కొత్త పేరు కావాలి : దీదీ
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘‘డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్.. ఈ లెక్కన పశ్చిమ బెంగాల్ పేరు ఆల్ఫాబెటికల్ జాబితాలో అట్టడుగున ఉంది. దీనివల్ల రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ సమావేశాల సమయంలో చివరి వరకు వేచి చూడాల్సి వస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చే బిల్లును గతంలోనే ఆమోదించాం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల క్లారిఫికేషన్లు కూడా ఇచ్చాం. కానీ చాలా కాలంగా మా రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చలేదు’’ అని మమతా బెనర్జీ చెప్పారు. గతంలో బాంబే, ఒరిస్సా పేర్లను.. ముంబై, ఒడిశాలుగా మార్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా తమ రాష్ట్రం రిక్వెస్టును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మార్పు జరిగితే.. బెంగాల్ యువత, విద్యార్థులు రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి పోటీలకు వెళ్లినప్పుడు వారికి ఎంతో దోహదకరంగా ఉంటుందన్నారు. “పాకిస్థాన్‌లో పంజాబ్ పేరుతో ఒక ప్రావిన్స్ ఉంది. భారతదేశంలో కూడా పంజాబ్ పేరుతో ఒక రాష్ట్రం ఉంది. బంగ్లాదేశ్‌ను బంగ్లా అని పిలుస్తుంటారు. అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా ఎందుకు మార్చకూడదు ?’’ అని దీదీ ప్రశ్నించారు.