Dhaka: భారత హైకమిషన్ వద్ద బీఎన్పీ నిరసన.. ఢాకాలో ఉద్రిక్తత

by vinod kumar |
Dhaka: భారత హైకమిషన్ వద్ద బీఎన్పీ నిరసన.. ఢాకాలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపుర రాజధాని అగర్తలా (Agarthala)లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయంలోకి ఈ నెల 2న పలువురు నిరసనకారులు చొరబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకా(Dhaka)లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఆదివారం నిరసన తెలిపింది. ఢాకాలోని భారత హైకమిషన్ (Indian high commission) కార్యాలయం ఎదుట లాంగ్ మార్చ్ నిర్వహించింది. అగర్తలాలో జరిగిన దాడులను ఖండిస్తు్న్నట్టు తెలిపింది. అయితే ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. భారత హైకమిషన్ వద్ద భారీగా బలగాలను మోహరించి బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనంతరం పోలీసుల అనుమతితో నిరసన కారులు భారత హైకమిషన్ కు మెమొరాండం అందజేశారు. తమ దేశ ఎంబసీపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరహా దాడుల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉందని తెలిపారు. కాగా, హిందువులపై నిరంతర దాడులు, హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Krishna das) అరెస్ట్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలను నిరసిస్తూ భారత్‌లో నిరసనలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల భారత రాయబారిని పిలిపించి, అగర్తలాలో బంగ్లాదేశ్ మిషన్‌పై నిరసనకారుల బృందం చేసిన దాడిపై నిరసన తెలిపింది.

Next Story

Most Viewed