- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fadnavis: వారిద్దరూ సేమ్ టూ సేమ్- మహా సీఎంపై కాంగ్రెస్ కామెంట్స్

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్దన్ సప్కల్ విమర్శలు గుప్పించారు. ఫడ్నవీస్ ని ఔరంగజేబుతో పోల్చడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఔరంగజేబు(Aurangzeb), ఫడ్నవీస్(Congress).. ఇద్దరూ అధికారం కోసం మతాన్ని ఉపయోగించిన "క్రూరమైన పాలకులు" అని అన్నారు. ‘‘ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రిని జైల్లో పెట్టాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా అటువంటి క్రూర స్వభావం గలవారే. మతాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వీరిద్దరి పాలన ఒకేలా ఉంది’’ అని హర్షవర్దన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, ఫడ్నవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బీజేపీ (BJP) తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి కళంకం తెచ్చిందని .. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే దుయ్యబట్టారు. ఔరంగజేబుతో ఫడ్నవీస్ ని పోల్చడం ఆ పార్టీకి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని, పిల్ల చేష్టలను తెలియజేస్తున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజల్లో పార్టీకి ఉన్న కాస్త మద్దతు కూడా పోతుందని పేర్కొన్నారు.
ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఔరంగజేబుపై ఇప్పటికే వివాదం కొనసాగుతుండగా.. ఈ తరహాలోనే మరోటి తెరపైకి వచ్చింది. అయితే, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ చిత్రం ఇటీవలే విడుదలైంది. అయితే, ఆ తర్వాత.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును (Aurangzeb) కీర్తిస్తూ మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్ నజ్మీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసీమ్ నజ్మీ వ్యాఖ్యలపై అధికార కూటమి తీవ్రస్థాయిలో మండిపడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయనపై చర్యలకు పట్టుబట్టింది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ముగిసే (మార్చి 26) వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వివాదం పెద్దది కావడంతో.. తన మాటలను వక్రీకరించారని పేర్కొంటూ నజ్మీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే, అతనిపై అప్పటికే పోలీసు కేసులు నమోదు కావడంతో జరగాల్సిన నష్టం జరిగింది. దీంతే, ఆయన ముంబై కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాల్సి వచ్చింది.
Read More..