Kolkata: రాష్ట్ర ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం

by Harish |   ( Updated:2024-08-16 07:38:06.0  )
Kolkata: రాష్ట్ర ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడగా, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలంలో పొలీసులు ఉన్నారు. అయిన కూడా దాడిని అడ్డుకోలేకపోయారు. ఇలాంటి పరిస్టితుల్లో డాక్టర్లు నిర్భయంగా ఎలా పని చేస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి సూచించారు

బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోకి నిరసనకారుల రూపంలో 40 మందికి పైగా దుండగులు ప్రవేశించి, విధ్వంసం సృష్టించారు. దుండగులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఎమర్జెన్సీ రూమ్, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, చుట్టుపక్కల ఉన్న పలు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. విధ్వంసకారుల దాడిలో పోలీసు వాహనం బోల్తాపడగా, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. దీంతో గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్‌లను ప్రయోగించారు.

Advertisement

Next Story

Most Viewed