- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. పాక్ ఆర్మీతో ముప్పే : సీడీఎస్
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా.. దాని సైన్యం ఆగడాలు మునుపటిలాగే ఆందోళనకర రీతిలో కొనసాగుతున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. పాక్ సైనిక శక్తి ఇంకా ఏ మాత్రం సన్నగిల్లలేదని చెప్పారు. న్యూఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ఈవివరాలను వెల్లడించారు. దేశ సరిహద్దులు, ప్రత్యేకించి ఉత్తరాదిలోని వివాదాస్పద బార్డర్లను కాపాడుకునేందుకు అవసరమైన వనరులన్నీ భారత సైన్యం వద్ద ఉన్నాయని అనిల్ చౌహాన్ వెల్లడించారు. 21వ శతాబ్దంలో భారత్‌కు ఎదురవుతున్న అతిపెద్ద భద్రతా సవాళ్లు ఏమిటని అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ సీడీఎస్ పైవ్యాఖ్యలు చేశారు. ‘‘సరిహద్దుల అవతల నుంచి ఎవరైనా భారత్‌పై దాడికి యత్నించినప్పుడల్లా మన వీర సైనికులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారు. శత్రువులను వెనక్కి తరిమికొట్టారు. కార్గిల్, గల్వాన్‌లలో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని యావత్ ప్రపంచం చూసింది’’ అని ఆయన గుర్తుచేశారు. ‘‘సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలే భారత సైన్యం ముందున్న తక్షణ సవాల్. డ్రాగన్‌తో సరిహద్దు సమస్య ఇంకా ఎటూ తేలలేదు. పాక్ కూడా భారత్‌కు బద్ధ విరోధి. తమ స్నేహం హిమాలయాల కంటే ఉన్నతమైనది. లోతైనదని పాక్, చైనాలు చెబుతుంటాయి. అవి రెండూ అణు సామర్థ్యం కలిగిన దేశాలే’’ అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఆ రెండు దేశాల బెదిరింపులకు భారత్ భయపడదని తేల్చి చెప్పారు.