పాక్‌ బార్డర్ లో ‘మిగ్‌-29’ యుద్ధ విమానాల మోహరింపు

by Prasanna |   ( Updated:2023-08-12 14:24:09.0  )
పాక్‌ బార్డర్ లో ‘మిగ్‌-29’ యుద్ధ విమానాల మోహరింపు
X

న్యూఢిల్లీ : బార్డర్ లో పాకిస్థాన్‌, చైనాలను ఎదుర్కొనేందుకు భారత్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌ లోని వ్యూహాత్మక శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌ లో అధునాతన మిగ్‌-29 యుద్ధ విమానాలను మోహరించింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్‌-21’ విమానాల స్క్వాడ్రన్ విధులు నిర్వహించేవి. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్‌-29 యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. కశ్మీర్‌ లోయ మధ్యలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో శ్రీనగర్‌ ఉంటుంది. వేగంగా స్పందించడం, దీర్ఘశ్రేణి క్షిపణులను మోసుకెళ్లే సామర్ధ్యాలు మిగ్‌-29 సొంతం. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ ఫీచర్‌ కారణంగా చిమ్మచీకట్లోనూ వీటిని ఉపయోగించే వీలుంటుంది. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉండటంతో.. సుదీర్ఘ దూరానికి వీటిని పంపించొచ్చు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే వీటిని శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌కు తరలించగా, తాజాగా విధుల్లోకి ప్రవేశపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed