- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ తరలిస్తున్న డ్రోన్ కూల్చివేత.. ఒకరు అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భారత్-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు మరో డ్రోన్‌ను కూల్చివేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జిల్లా దనోయీ కుర్ద్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా డ్రోన్ చప్పుడు వినిపించింది. దాంతో అప్రమత్తం అయిన జవాన్లు కాల్పులు జరిపి దానిని కూల్చివేశారు. అనంతరం దానిని గాలిస్తూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోకి పరుగెత్తటం కనిపించింది. వారిని వెంటాడిన జవాన్లు ఒకరిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలాల్లో కూలిపోయిన డ్రోన్ ను సీజ్ చేసారు. డ్రోన్ల ద్వారా భారత్ లోకి డ్రగ్స్ స్మగుల్ చేస్తున్న పాక్ ప్రయత్నాన్ని మరోసారి తిప్పి కొట్టినట్టు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.