- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌ను పిల్‌గా పరిగణిస్తామన్న హైకోర్టు
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ ను పిల్ గా మాత్రమే పరిగణిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసి తన ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేలా భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ నరులా.. సుబ్రమణ్య స్వామి ఈ విషయంలో అమలు చేయదగిన రాజ్యాంగ హక్కులను ప్రదర్శించడంలో విఫలమయ్యారని, దీనిని పిటీషన్ గా పరిగణించలేమని స్పష్టం చేశారు.
అయితే, ఈ విషయంలో ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్న స్వామి వైఖరిని గుర్తించిన కోర్టు, ఈ పిటిషన్‌ను పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ గా తీసుకుంటామని, దీనిని పిల్ లతో వ్యవహరించే రోస్టర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది. దీంతో కోర్టు ఈ కేసును యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని రోస్టర్ బెంచ్ కు బదిలీ చేసింది. కాగా రాహుల్ గాందీ బ్రిటీష్ పాస్ పోర్ట్ కలిగిన బ్రిటీష్ పౌరుడినని, యూకే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా వెల్లడించడం పట్ల మాజీ కేంద్రమంత్రి బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఆయన పౌరసత్వంపై వివరాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాశారు. అయితే రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడంతో కేంద్రం విఫలమైందని, ఆయన పౌరసత్వం రద్దు చేసేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆగస్ట్ 16న హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.