Delhi Police: పోలీసుల‌కు సెల‌వులు ర‌ద్దు.. శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఢిల్లీ నిర్ణ‌యం!

by Sumithra |   ( Updated:2022-06-14 12:03:56.0  )
Delhi Police Cancels their Personnels Leaves Due To Communal Scenario
X

దిశ‌, వెబ్‌డెస్క్ః Delhi Police Cancels their Personnel's Leaves Due To Communal Scenario| మ‌రో కొన్ని నెల‌ల్లో దేశంలో సాధార‌ణ ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయం భ‌గ‌భ‌గా మండుతోంది. మ‌రోవైపు, దేశంలో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు మ‌రింత రాజుకుంటుంటే.. మ‌త‌స‌హ‌నానికి మ‌న దేశం మారుపేరు అని చెప్పే రాజ‌కీయ నాయ‌కుల్లో కొంద‌రు ఘ‌ర్ష‌ణ‌లు మ‌రింత పెంచే కామెంట్లు చేస్తున్నారు. ఇలా అల్ల‌క‌ల్లోలంగా ఉన్న దేశంలో ఇప్పుడు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు లోటు ఏర్ప‌డ‌గా, ఈ ప‌రిణామం దేశ రాజ‌ధాని ఢిల్లీలో పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. త‌ద్వారా, ఢిల్లీలోని నార్త్‌వెస్ట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ 'మత ఘ‌ర్ష‌ణ‌ల దృష్ట్యా', అలాగే, దేశ రాజధానిలో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితిని ఉటంకిస్తూ, అన్ని విభాగాల‌ పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూన్ 13న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగాని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్ర‌క‌టించారు.

స‌ద‌రు ఆర్డర్ ప్రకారం ఇప్పటికే మంజూరు చేసిన‌, మంజూరు అయిన‌ సెలవులు కూడా రద్దు చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. "ఇప్పటికే సెలవుపై ఉన్న‌ అధికారులు, సిబ్బంది వెంటనే తమ విధుల్లో చేరాలని, ఏ అధికారి డీసీపీ/ఎన్‌డబ్ల్యూడీ ముందస్తు అనుమతి లేకుండా తమ కింది సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదని ఆదేశాలు పంపారు. నిబంధనలు పాటించని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏప్రిల్ 16న ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విష‌యం తెలిసిందే. ఇందులో, 8 మంది పోలీసు సిబ్బందితో స‌హా స్థానికుల‌కు గాయాల‌య్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురు మైన‌ర్ల‌తో స‌హా 36 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఇక‌, ఇటీవ‌ల ముహమ్మద్ ప్రవక్తపై ఇద్దరు బిజెపి నేత‌ల‌ వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు చెల‌రేగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి, ఈ క్ర‌మంలో స‌ద‌రు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed