- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pollution Certificates : 24 రోజుల్లో రూ.47 కోట్ల జరిమానాలు.. ‘పొల్యూషన్’ సర్టిఫికెట్లు లేని వారిపై కొరడా
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం దడ పుట్టిస్తోంది. గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనేపథ్యంలో కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి 24 వరకు 47,363 మంది వాహనదారులకు ఛాలాన్లు జారీ చేసి, చెరో రూ.10వేల జరిమానా విధించారు. ఇదంతా లెక్కేస్తే దాదాపు రూ.47 కోట్లకుపైనే అవుతుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (Pollution Certificates) సర్టిఫికెట్లు లేని వారు, ఆ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగిసిన వారిపై ఈ జరిమానాలు విధించారు.
ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాణిజ్య వాహనాలపైనా ఫైన్లు వేశామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం వాహనదారులంతా ‘పొల్యూషన్’ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘పొల్యూషన్’ సర్టిఫికెట్లకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు 2,50,761 ఛాలాన్లు జారీ చేశారు. 2023 సంవత్సరంలో 2,32,885 ఛాలాన్లు, 2022లో 1,64,638 ఛాలాన్లను జారీ చేశారు.