- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ లిక్కర్ కేసు: జైలు నుంచి బయటకొచ్చిన మనీష్ సిసోడియా
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుల్లో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటి సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చారు. పోలీసుల వాహనంలో అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వచ్చారు. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా కోర్టు అనుమతితో ఇవాళ ఉదయం ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన తన భార్యతోనే ఉండనున్నారు. అయితే భార్య అనారోగ్యంతో ఉందని తనను కలుసుకునేందుకు 5 రోజులపాటు అనుమతివ్వాలని సిసోడియా గతంలో కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
నిన్న దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో తన భార్యను కలిసేందుకు అనుమతిచ్చింది. అయితే, ఎలాంటి రాజకీయ సమావేశాలు, ప్రసంగాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సిసోడియా జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లిపోనున్నారు. మరోవైపు సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.