- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడవడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది. ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ‘‘అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై భార్య ఒత్తిడిని పెంచడం సరికాదు. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ప్రశాంతతలకు చోటులేకుండా పోతుంది. భర్తపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ అవసరాలు, కోరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’’ అని ధర్మాసనం సూచించింది. భార్య టార్చర్‌ను భరించలేక విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. విడాకులను పొందేందుకు బాధిత భర్తకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. తన తల్లిదండ్రుల నుంచి రూ.8వేలు అప్పు తీసుకున్న విషయాన్ని పదేపదే చెప్పి భర్తను భార్య టార్చర్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలని భర్తను ఆమె బలవంతపెట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది.