- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను తొలగించాలన్న పిల్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి అరెస్ట్ అయిన కారణంగా సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి పరిశీలించాలని, కోర్టు జోక్యం చేసుకోదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. 'న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం ఉందా? లెఫ్ట్‌నెట్ గవర్నర్ ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు మేము వార్తాపత్రికలో చదివాము. అది రాష్ట్రపతి ముందుకు వెళ్తుంది. ఇందులో జోక్యం చేసుకోలేమని' తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు కానీ, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, తాము రాజకీయ అంశాల్లోకి రామని, ప్రజలే ఈ సమస్యలపై తుది నిర్ణయం తీసుకుంటారని కోర్టు అభిప్రాయపడింది. ఇక, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా జైలు నుంచే ఆదేశాలను జారీ చేస్తున్నారు.