- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Election Schedule: ఢిల్లీ ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 5న పోలింగ్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు(Delhi polls) నగారా మోగింది. ఢిల్లీలో ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్(Chief Election Commissioner Rajiv Kumar) మీడియాతో మాట్లాడారు. 70 శాసనసభ స్థానాలున్న డిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామంది.
ట్యాంపరింగ్, ఓటరు జాబితాపై..
అంతేకాకుండా, ఈవీఎం ట్యాంపరింగ్(EVM manipulations), ఓటర్ల జాబితా(Voter lists)లో అవకతవకల గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. వీటిపైన స్పష్టతనిచ్చారు. ‘‘రాజకీయ పార్టీలతో సన్నిహిత సమన్వయంతో, పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 70 దశలతో కూడిన విస్తృతమైన విధానాలు రూపొందించాం. ప్రతి దశలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం. అభ్యంతరాలను లేవనెత్తడానికి తగినంత సమయాన్ని అందిస్తాం. ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ. ఓటరు జాబితాలో పేర్ల చేరిక, తొలగింపులకు సంబంధించి విధివిధానాలను పాటిస్తున్నాం. ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదు. అయితే, ఎన్నికల ప్రక్రియపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఓటింగ్‌లో మనం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. త్వరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100కోట్లను దాటనుంది.’’ అని రాజీవ్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పులు చెప్పాయని సీఈసీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతంలో భారీ మార్పులు ఉంటున్నాయంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరన్నారు.
గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే?
70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనుంది. ఆలోగానే ఎన్నికలు (Delhi Election Schedule) నిర్వహించాల్సి ఉంది. గతంలో 2020లో ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ (BJP) సంఖ్యాబలం 8గా ఉంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ వేస్తుంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా. కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి.