- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi court: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు షాక్.. విచారణను నిలిపివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi liquor scam)లో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పై విచారణను నిలిపివేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High court) నిరాకరించింది. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరంపై దిగువ కోర్టు విచారణ చేపట్టిందని కేజ్రీవాల్ వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) స్పందన కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది.
అయితే, ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Thushar mehatha) మాట్లాడుతూ.. నేరం జరిగినప్పుడు తాను ప్రభుత్వ ప్రతినిధి అయినందున ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి అనుమతి లేకపోవడంతోనే ప్రత్యేక కోర్టు చార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్ లభించిందని, దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం జైలులో ఉండగానే జూన్ 26న సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ జైలుపై బయట ఉన్నారు.