4 రోజులైనా నో రెస్పాన్స్.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ డెసిషన్‌పై తీవ్ర ఉత్కంఠ!

by Satheesh |   ( Updated:2023-05-29 11:00:08.0  )
4 రోజులైనా నో రెస్పాన్స్.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ డెసిషన్‌పై   తీవ్ర ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ముంగిట్లో జాతీయ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారుల బదిలీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ప్రతిపక్షాల మద్దతు కోరుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలో కాంగ్రెస్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో మద్దతు కోరే నిమిత్తం కేజ్రీవాల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరి నాలుగు రోజులు అవుతున్నా కాంగ్రెస్ నుంచి రెస్పాన్స్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో కలిసి బీజేపీని ఎదుర్కోనేందుకు విపక్షాలు ఏకం కావాలనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో కేజ్రీవాల్ విజ్ఞప్తిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ కు మద్దతు వద్దని ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. పార్టీ ఓటమికి కారణమైన కేజ్రీవాల్ ను చేరదీయవద్దని వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఆ రెండు రాష్ట్రాల నేతలతో భేటీ అయి కేజ్రీవాల్ పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed