UNESCO: ఢిల్లీలోని స్మారక చిహ్నాలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు

by S Gopi |
UNESCO: ఢిల్లీలోని స్మారక చిహ్నాలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంలో కీలకంగా వ్యవహరించే యునెస్కో హెరిటేజ్‌ కమిటీ 46వ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటిసారి భారత్ ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పలు స్మారక చిహ్నాలను సందర్శించారు. జూలై 21 నుంచి జరుగుతున్న ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై చర్చల అనంతరం సెలవు తీసుకుని షాపింగ్, భారతీయ వంటకాలు, ఇతర కార్యక్రమాల్లో వారు ఆనందంగా గడిపారని సాంకృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశాలు జూలై 31 వరకు జరగనున్నాయి. జూలై 26-27 తేదీలలో ప్రపంచ వారసత్వ కమిటీ అనేక చర్చల తర్వాత ప్రపంచ వారసత్వ జాబితాలో 25 కొత్త ప్రదేశాలను ప్రకటించింది. 150కి పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కమిటీ సభ్యులు కొందరు చేసిన అభ్యర్థనల తరువాత, ఒక రోజు సెలవు కావాలని, భారతదేశ వారసత్వ అంశాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. వారి కోరిక మేరకు ఢిల్లీ, చుట్టుపక్కల ఉన్న స్మారక చిహ్నాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించడానికి భారత పురావస్తు శాఖ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. చాలామంది ప్రతినిధులు చారిత్రాత్మక ఆగ్రా నగరాన్ని సందర్శించేందుకు ఎంచుకున్నారు. అక్కడ వారు రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కాకుండా, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ స్మారక కట్టడాలతో పాటు తాజ్ మహల్‌లను సందర్శించారు.

Advertisement

Next Story

Most Viewed