US: నాలుగు రోజుల అమెరికా పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by Harish |   ( Updated:2024-08-21 09:31:24.0  )
US: నాలుగు రోజుల అమెరికా పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-అమెరికా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఆగస్టు 23 నుంచి 26 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా వాషింగ్టన్‌లో రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ తదితరులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చలు జరుపుతారు. అక్కడ భవిష్యత్ రక్షణ సహకారాలపై ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు, స్ట్రైకర్ పదాతిదళ పోరాట వాహనాల ప్రతిపాదిత ఉమ్మడి తయారీ, భారత్‌లో GE F414 ఇంజిన్‌ల ఉత్పత్తి వంటి మొదలగు అంశాలపై లాయిడ్‌ ఆస్టిన్‌‌తో రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు. అమెరికా అధికారులతో పర్యటన ముగిసిన తరువాత ప్రవాస భారతీయలతో కూడా సంభాషించనున్నారు. భారత్-అమెరికా మధ్య బహుళ స్థాయిలలో రక్షణ కార్యకలాపాలలో సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed