- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర విషాదం.. కోరమాండల్ రైలు ప్రమాదంలో 233కు చేరుకున్న మృతుల సంఖ్య

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన కోరమాండల్ రైలు ప్రమాద మృతుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతుంది. నిన్న రాత్రి వరకు 50 మంది మృతి చెందినట్లు తెలపగా.. శనివారం తెల్లవారు జాము వరకు ఈ ప్రమాద మృతుల సంఖ్య 233 పెరిగింది. అలాగే దాదాపు 900 మంది వరకు గాయపడినట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె జెనా ట్వీట్ చేశారు.
కాగా ఈ ప్రమాదంలొ ఇంకా 500 లకు పైగా రైలు కోచ్‌లోనే ఇరుక్కుపోయారని.. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లు రక్షణ చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రైలు ప్రమాదం బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగింది.
Next Story