అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య

by Mahesh |   ( Updated:2024-07-02 13:01:59.0  )
అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 70 చేరుకుంది. అలాగే వందల సంఖ్యలో మహిళలు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రతిబన్సూర్‌ సత్సంగ్ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.. అత్యధికంగా మహిళలు, పిల్లలు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారిలో కూడా అత్యధికంగా మహిళలే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి బయట మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను వెంటనే కనిపెట్టి కారకులను కఠినంగా శిక్షించాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story