- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీతారాం ఏచూరి మరణం.. దేశ రాజకీయాలకు తీరని లోటు! ప్రధాని మోదీ
దిశ, వెబ్ డెస్క్: సీపీఎం(Communist Party of India(MARXIST)) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజకీయ కురువృద్ధుడు.. సీతారాం ఏచూరి(Sitaram Yechury) (72) మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా.. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న సీతారాం, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో తన తుదిశ్వాస విడిచారు. కాగా, సీతారాం మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
వామపక్షాలకు 'ఏచూరి' ఒక మార్గదర్శి...
సీతారాం ఏచూరి మరణం.. భారత రాజకీయాలకు తీరని లోటని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 'ఎక్స్'(X) లో మాట్లాడుతూ.. "శ్రీ సీతారం ఏచూరి జీ మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన వామపక్షాలకు ఒక మార్గదర్శిగా ఉన్నారు. సమర్ధవంతమైన పార్లమెంటేరియన్ గా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విషాద సమయంలో ఇప్పుడు నా యొక్క ఆలోచనలన్నీ.. ఏచూరి కుటుంబ సభ్యులపైనే ఉన్నాయి." అంటూ మోదీ ఎక్స్ లో వెల్లడించారు.