- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో తారాస్థాయికి చేరిన నీటి కష్టాలు.. బిందె నీళ్లు రూ. 25
దిశ, వెబ్ డెస్క్: గత వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వేసవి ప్రారంభం కాకముందే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిందె నీళ్లకు 25 వసూలు చేస్తున్నప్పటికీ.. కొనుక్కోని తాగడానికి కూడా నీరు లభించడం లేదు. ముఖ్యంగా బెంగళూరులో అయితే మంచినీటి సమస్య అధికంగా ఉంది. చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో.. దాదాపు 7 వేలకు పైగా భూగర్భపు ఓరు బావులు అడుగంటి పోయినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం హుటాహుటిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది.
ప్రజలకు తక్షణం తాగు నీటిని అందించేందుకు ట్యాంకర్లను రంగంలోకి దించింది. కాలనీలు, గ్రామాలలోని ప్రజలకు ట్యాంకర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. వేసవి ప్రారంభం కాకముందే పరిస్థితులు ఇలా ఉంటే మరో నెల రోజుల్లో కర్ణాటక ఎడారిలా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి మొదలవడంతో నీటిపై ఆధారపడి ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.