Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై స్పందించిన దలైలామా..

by Vinod kumar |
Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై స్పందించిన దలైలామా..
X

లేహ్: ‘చంద్రయాన్-3’ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంపై టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పందించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. ‘ఈ విజయం.. పురాతన కాలం నుంచి శాస్త్రీయ అభివృద్ధికి తమ దృష్టిని అంకితం చేసిన భారతదేశ ప్రజలకు ఒక నివాళి’ అని దలైలామా చెప్పినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ మేరకు దలైలామా.. ఇస్రో చైర్మన్ సహా ఏజెన్సీలోని శాస్త్రవేత్తల బృందాన్ని సైతం ప్రశంసించారు.

‘మిషన్‌ను సాధ్యం చేసిన వారి అంకితభావానికి గాను ఇస్రో అధిపతి, అతని బృందాన్ని అభినందించాలని అనుకుంటున్నాను. వారు భారతదేశ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించారు’ అని తెలిపారు. అంతేకాదు భారతదేశంలో ఎక్కువ కాలం గడిపిన అతిథిగా, ఈ గొప్ప విజయానికి తాను సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇండియన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. మున్ముందు శాస్త్రీయ ప్రయత్నాల్లో తన నాయకత్వ పాత్రను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నానంటూ ముగించారు.

Advertisement

Next Story

Most Viewed