- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం.. ‘తేజస్’ చరిత్రలో తొలిసారి ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హాస్టల్ భవనం వద్ద శకలాలు కింద పడిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 'ఒక తేజస్ విమానం జైసల్మేర్ వద్ద ఈరోజు శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించామని' వెల్లడించింది. కాగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన తేజస్ యుద్ధ విమానం 2016లో వాయుసేనలోకి చేర్చారు. అయితే 2001లో తొలి టెస్ట్ ఫ్లైట్ నుంచి ఇప్పటి వరకు తేజస్ ఫ్లైట్స్ కూలిపోవడం ఇదే మొదటిసారి. మరోవైపు పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.