Supreme Court: ఢిల్లీ ప్రభుత్వం, సీపీకీ నోటీసులు.. కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

by Shamantha N |
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వం, సీపీకీ నోటీసులు.. కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి (Diwali) తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు (Supreme Court) నిప్పులు చెరిగింది. దేశ రాజధానిలో టపాసులు కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని అసహనం వ్యక్తంచేసింది. ఈ ఏడాది నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం (Delhi government), పోలీసు కమిషనర్‌కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అలాగే వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు అందులో పొందుపరచాలని ఆదేశించింది.

పంటపొలాల దహనం

దీపావళికి ముందు పంటపొలాలకు నిప్పంటించిన కేసులు కూడా పెరిగాయని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. అక్టోబర్ నెలలోని చివరి పది రోజుల్లో ఎన్ని పంటపొలాలు దగ్ధం చేశారో తెలిపే అఫిడవిట్‌లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను(Punjab and Haryana governments) సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఢిల్లీ పరిధిలోని పొలాల్లో మంటలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయో లేదో తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇకపోతే, దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉందని రాయిటర్స్ నివేదించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటి.. తీవ్రస్థాయికి చేరుకుంది.

Advertisement

Next Story