- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sitaram Yechury: ఆసుపత్రిలో చేరిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దిశ, నేషనల్ బ్యూరో: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఆయనను సాయంత్రం ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏచూరి పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఇంకా వివరాలు వెల్లడించలేదు. అయితే, న్యుమోనియా కారణంగా ఏచూరి అడ్మిట్ అయ్యారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సీపీఐ(ఎం)కి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుత ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్న ఏచూరి ఇటీవలే కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ వారసత్వాన్ని కొనసాగించడంలో ఏచూరి విజయ సాధించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి పి చిదంబరంతో కలిసి పనిచేశారు. 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో సంకీర్ణ నిర్మాణ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించారు. ఏచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. ఒక సంవత్సరం తరువాత, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. 1975లో జేఎన్‌యూలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. 1977-78 సంవత్సరంలో మూడు సార్లు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. జేఎన్‌యూలో బలమైన వామపక్ష ఉనికిని నెలకొల్పడంలో ప్రకాష్ కారత్‌తో పాటు, ఏచూరి కీలక పాత్ర పోషించారు.